అగ్రీగోల్డ్‌ బాధితులకు శుభవార్త

అగ్రీగోల్డ్‌ బాధితులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన తొలి కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవరత్నాలు, పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలుపై ప్రధానంగా దృష్టి సారించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై చర్చించిన కేబినెట్‌.. అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేస్తు నిర్ణయం తీసుకుంది. సీపీపీ రద్దు సాధ్యాసాధ్యాలపై కూడా ఉన్నతస్థాయి కమిటీ వేసింది. ఉద్యోగులకు 27శాతం ఐఆర్‌ ప్రకటించారు. ఇది జులై 2018 నుంచే అమలు చేయనున్నారు. అటు అటు ఆశావర్కర్ల జీతాలు 10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడి సిబ్బందికి వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్‌ ప్రకటించారు. హోంగార్డులకు కూడా వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

రైతుల కోసం ధరల స్ధిరీకరణ నిధులతో పాటు.. పంట బీమా ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. క్లెయిముల బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అక్టోబర్‌ 15 నుంచి రైతు భరోసా పథకం అమలుచేయనున్నట్టు తెలిపారు. రైతు కమిషన్ ఏర్పాటు చేసి అందులో నిపుణులు, రైతు సంఘాల నాయకులను సభ్యులుగా నియమిస్తామన్నారు. రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీలో అవినీతి లేని పాలన అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని జగన్‌ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై జ్యుడిషియల్‌ కమిటీ ద్వారా విచారన జరిపించాలని కేబినెట్‌ లో నిర్ణయించారు.

వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకం అమలు చేయాలని వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 25లక్షల మందికి ఇళ్ల నిర్మాణం, అర్హత, అనుభవం ఆధారాంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, అగ్రీగోల్డ్‌ బాధితుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. 11వందల 50 కోట్ల నిధులు, గ్రామ వాలంటీర్ల నియామకాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంది. రేషన్‌ షాపుల ద్వారా నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడంతో పాటు.. నిత్యావసరాలు పెంచాలని నిర్ణయించారు. పారిశుధ్య కార్మికులకు 18వేల వేతనం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది.

Tags

Read MoreRead Less
Next Story