స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు.. ఈనెల 10లోపు అప్లై..

మెదక్ జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలోని జిల్లా బాలల సంరక్షణ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయడానికి దరఖాస్తులు కోరుతున్నారు. ప్రొటక్షన్ ఆఫీసర్, లీగల్‌కమ్ ప్రొటక్షన్ ఆఫీసర్, సోషల్ వర్కర్ (మహిళ), అకౌంటెంట్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఈనెల 10 వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జ్యోతి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన వివరాల కోసం వెబ్ సైట్: http//wdcw.tg.nic.inay చూడవచ్చు.

Recommended For You