ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి

isro-launch-hysis-satellite-30-others-pslv-c43-rocket

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనత సాధించింది. సమాచార ఉపగ్రహాల ప్రయోగంలో ఆరి తేరిన ఇస్రో, తాజాగా మరో సమాచార ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్‌గా అంతరిక్షంలోకి పంపించింది. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు అంత రిక్ష పరిశోధనా కేంద్రం నుంచి కమ్యూనికేషన్ శాటిలైట్ జిశాట్-31ను ప్రయోగించారు. ఏరియానా స్పేస్‌ రాకెట్‌, జి శాట్-31ను 42 నిమిషాల్లోనే కక్ష్యలోకి చేర్చింది.

భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున 2 గంటల 31 నిమిషాలకు జీశాట్‌ -31 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. జీశాట్‌ -31తో పాటు సౌదీకి చెందిన 1 హెల్లాస్‌ శాట్‌ -4ను కూడా రోదసీలో ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేశారు.

Also Read : చాక్లెట్‌ రోజూ తింటే ఎన్ని ఉపయోగాలో..

జిశాట్ బరువు 2,535 కిలోలు. ఇందులో అత్యంత సమర్థమంతమైన కేయూ బ్యాండ్‌ ప్రసార వ్యవస్థ ఉంది. ఈ సమా చార ఉపగ్రహం 15 ఏళ్ల పాటు నిరాటంకంగా సేవలందించనుంది. భారతీయ భూభాగాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిసరాల సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఇప్పటికే భూస్థిర కక్ష్యలో ఉన్న ఇతర కమ్యూ నికేషన్ శాటిలైట్లతో కలసి జిశాట్-31 పని చేయనుంది.

Recommended For You