ఆమెను ప్రశంసిస్తూ ‘ఆనంద్ మహీంద్రా’ ట్వీట్..

కాలం మారింది. మనమూ మారాలి. ఉరుకులు పరుగులు పెడుతున్న జీవితంలో భార్యా భర్తలు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. ఇంకా కొన్ని కుటుంబాల్లో ఇది స్త్రీలు మాత్రమే చేసే పని అని గిరి గీసుకుని ఉంటున్నారు.

అన్ని రంగాల్లో ‘ఆమె’ ముందున్నా కొన్ని పనులు స్త్రీలు మాత్రమే బాధ్యతగా నిర్వర్తించగలరు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ‘ఆమె’ని ప్రశంసిస్తున్నారు. గత వారం రోజులుగా ఏడాది వయసున్న తన మనవరాలి ఆలనా పాలన చూస్తున్నానని చెప్పిన ఆనంద్.. స్త్రీ, పురుషులు పరుగు పందెంలో పాల్గొంటున్న కార్టూన్‌ని షేర్ చేశారు.

పురుషులు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తే సరిపోతుంది. కానీ మహిళలు మాత్రం ఉద్యోగంతో పాటు, ఇంటి పనిని కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని అన్నారు. తానెంచుకున్న ఉద్యోగంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటన్నింటిని ఎదర్కుంటూ పురుషులకంటే ఎక్కువగా శ్రమిస్తున్న మహిళలకు ఆయన సెల్యూట్ చేశారు. చిన్న పనిలో కూడా సంతోషాన్ని వెదికి ఆనంద్ మహీంద్రా ఆ ఆనందాన్ని అందరికీ పంచుతారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఆయన చేసే కామెంట్లు కూడా అర్థవంతంగా, వైవిధ్యంగా ఉంటాయి. నెటిజన్స్ ప్రశంసలను సైతం పొందుతాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ తాజా ట్వీట్‌పై.. పురుషులు అంతకు మించి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని కొందరంటే.. స్త్రీల శ్రమను గుర్తించారంటూ మరికొందరు ఆనంద్ మహీంద్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Recommended For You