పిచ్చి పలురకాలు.. యువకుడు తన తల్లిదండ్రులను అరెస్టు చేయాలంటూ..

పిచ్చి పలురకాలంటారు. ఇప్పుడు మీరు చదవబోయేది అలాంటి వార్తే. ఇది ముంబై యువకుడికి సంబంధించిన వార్త. ఇంతకీ అతనేం చేశాడో తెలుసా.. తన తల్లిదండ్రులకు అరెస్టు నోటీసులు పంపబోతున్నాడు.

ముంబయికి చెందిన 27 ఏళ్ల రాఫెల్‌ సామ్యూల్‌.. తన తల్లిదండ్రులను అరెస్టు చేయాలంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. తన ముఖానికి గుబురుగడ్డం, మీసం తగిలించుకుని తాను చెప్పాలనుకున్నది చెప్పాడు. ఇదేంట్రాబాబూ ఈ పైత్యం అని అంతా దీన్ని ఆశ్చర్యంతో చూశారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అతను అలా ఎందుకు అంటున్నాడో తెలిస్తే షాకవుతారు. అతని అనుమతి తీసుకోకుండా తల్లిదండ్రులు జన్మనిచ్చారట. అందుకే వారిని అరెస్ట్‌ చేయాలని అంటున్నాడు.

Also Read : నటనలో సక్సెస్‌.. ప్రేమలో పెయిల్.. నటి జీవితం విషాదం..

తన ప్రమేయం లేకుండా భూమిమీదకు వచ్చాడు కాబట్టి.. తనకు ఏం కావాలన్నా అన్నీ అటోమేటిగ్గా తన కాళ్ల దగ్గరకు వచ్చి పడిపోవాలనుకుంటున్నాడు. అసలు తానెందుకు బాధపడాలి.. తానెందుకు కష్టపడాలని ప్రశ్నిస్తున్నాడు. పేరెంట్స్ సంతోషం కోసం పిల్లలు పుట్టినప్పుడు.. వియ్ షుడ్‌ బీ పెయిడ్ అంటున్నాడు. నిర్ణయం తనది కానప్పుడు తానెందుకు బాధపడాలని.. తానెందుకు కష్టపడాలని నిలదీస్తున్నాడు.

పిల్లలంటే తల్లిదండ్రుల ఇన్వెస్ట్‌మెంట్ కాదంటున్నాడు శామ్యుల్. ఎవరూ పేరంట్స్ కోసం త్యాగాలు చేసో.. మరొకటో చేసో జీవించాల్సిన అవసరం లేదంటున్నాడు. ఈ వితండవాదం ఏంటని ఎవరైనా తిడుతున్నా డోన్ట్ కేర్ అంటున్నాడు. తిడితే తిట్టారు కానీ ముందు నా కాన్సెప్ట్ అర్థం చేసుకోండని చెప్తున్నాడు.

ఇలా వింతయిన పిడివాదాన్ని వినిపించేవాళ్లను యాంటీ నాటనలిస్ట్‌ అంటారు. పిల్లల్ని కనడం.. పునరుత్పత్తి ఎందుకు అనే కాన్సెప్ట్‌తో బతికేవాళ్లన్నమాట. తన పోస్ట్‌పై ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని స్థితిలోనే తన తండ్రి ఉన్నారని.. తన తల్లి మాత్రం వాస్తవానికి దగ్గరగా ఆలోచించిందని శామ్యుల్ చెప్పుకొచ్చాడు. లాయర్ అయిన తన తల్లి కవితా కర్నాడ్ శామ్యుల్ తనను మెచ్చుకుందంటున్నాడు. తప్పు ఆమెవైపే ఉంటే ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పిందంటున్నాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వివరీతంగా చర్చనీయాంశమైంది.

Recommended For You