లిప్ట్‌లో లిప్‌కిస్సులు.. మెట్రో స్టేషన్లలో స్టూడెంట్స్ రాసలీలలు..

బెంగళూరు మెట్రో రైల్వే స్టేషన్లలో లిఫ్ట్‌లు రాసలీలలకు కేరాఫ్‌ అయ్యాయి. లిఫ్ట్‌లను లిప్‌కిస్సులకు అడ్డాగా మార్చేసుకుంటున్నారు కాలేజీ యూత్. లోపలికి ఎక్కాక డోర్ క్లోజ్ అవడం ఆలస్యం.. సరసాలకు తెర తీస్తున్నారు. మీదపడి మరీ ముద్దులు పెట్టేసుకుంటున్నారు. ఒకటికాదు రెండు కాదు ఇలాంటి లెక్కలేనన్ని సీన్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

లిఫ్టుల్లో లిప్‌కిస్‌లు పెట్టుకుంటూ కెమెరాల్లో చిక్కిన వాళ్లంతా ఇంటర్, ఇంజినీరింగ్ స్టూడెంట్‌లే. రోజూ కాలేజీలకు వెళ్లేప్పుడు వచ్చేప్పుడు ఇలా పబ్లిక్ ప్లేసుల్లోనే తెగించేస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ షాకింగ్‌గా మారాయి. ఈ ఫుటేజ్‌ బెంగళూరు మెట్రో స్టేషన్లలోనివి. విద్యార్థుల్లో ఈ తరహా విశృంఖలత్వం మాత్రం పేరెంట్స్‌కు కచ్చితంగా వార్నింగ్ బెల్లే.

Also Read : పిచ్చి పలురకాలు.. యువకుడు తన తల్లిదండ్రులను అరెస్టు చేయాలంటూ..

తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. తప్పు చేయరు అని నమ్మి కావాల్సినంత స్వేచ్ఛ వాళ్లకు ఇస్తారు. కానీ అది కట్టుతప్పుతోంది అని చెప్పడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. సినిమాలు, ఇంటర్నెట్ కూడా యువతను పాడు చేసేస్తున్నాయి. కాలేజీలో అడుగుపెడుతూనే డోన్ట్‌కేర్ అనే ధోరణి తలకు ఎక్కడం, తమకు గాళ్‌ఫ్రెండో, బాయ్‌ఫ్రెండో కచ్చితంగా ఉండాలని భావించడం లాంటివన్నీ కలిపి.. ఇలా తప్పటడుగులు వేయడానికి కారణాలవుతున్నాయి.

లిఫ్ట్‌లో డోర్ క్లోజ్ అయితే ఇక తమను ఎవరూ చూడరన్న ఉద్దేశంతో టీనేజర్లు.. వీటిని లిప్‌కిస్‌లకు అడ్డాగా చేసుకుంటున్నారు. పైఫ్లోర్‌కి వెళ్లే ఐదు పది సెకన్లలో హడావుడిగా ముద్దులు కౌగిలింతల్లో మునిగిపోయి, తీరా తలుపులు తెరుచుకునే టైమ్‌కి లిఫ్ట్‌లో ఓ మూలన ఉన్న CC కెమెరా చూసి షాకైన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అవి అలా షేర్ అవుతూ.. అవుతూ.. తమ బంధువుల దగ్గరకో, కుటుంబ సభ్యుల దగ్గరకో చేరితే తల ఎత్తుకోగలరా..? ఒక్కసారి విచక్షణతో ఆలోచిస్తే పిల్లలతోపాటు పెద్దవాళ్ల పరువు కూడా నిలబడుతుందంటున్నారు.

Also Read : సినీ నటిని దారుణంగా హత్య చేసిన ప్రముఖ దర్శకుడు..

Recommended For You