‘యాత్ర’ అమెరికాలో ఆల్మోస్ట్ ఫుల్..

yatra movie tickets almost full in america

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో భాగమైన ‘పాదయాత్ర’ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’ ఈ సినిమా ఫ్రిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైయస్ పాత్రను పోషించారు. నైజాం, వైజాగ్ ఏరియాల్లో యాత్ర ను రిలీజ్ చేస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఇక యూఎస్ లో ఒకరోజు ముందే ఈ సినిమా విడుదల అవుతోంది. తెలుగువారున్న ప్రధాన నగరాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను అమెరికాలో రెండు రోజుల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు ప్రేక్షకులు. కాగా ‘యాత్ర’ సినిమా ప్రీమియర్ షో బుకింగ్ అమెరికాలో ఆల్మోస్ట్ ఫుల్ అయిపోవడం విశేషం.

Recommended For You