ఆస్ట్రేలియాలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న వైయస్ అభిమానులు

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఈవెంట్ బయోపిక్ గా వచ్చిన యాత్ర చిత్రం ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో ఘనంగా రిలీజ్ అయింది. ఈ సందర్బంగా తమ అభిమాన నేత సినిమాను చూసేందుకు ఆస్ట్రేలియాలోని వైఎస్ అభిమానులు, వైసిపి నాయకులు దీయేటర్లకు భారీగా తరలివచ్చారు. ధియేటర్ లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సినిమాలో వైఎస్ పాదయాత్ర, పరిపాలనను కళ్లకు కట్టినట్లు చూపించారని వారు కొనియాడారు.

Recommended For You