బంగారం.. ఎవర్ని పెళ్లి చేసుకుంటావురా: బన్నీ

ఎవరు ఏం చేసినా వైరలే. నాలుగు మాటలు లేదా నాలుగు డ్యాన్సులు వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే లైకులు. మరిక సెలబ్రిటీలు అయితే ఇంకొంచెం వైరల్. అది అల్లు అర్జున్ అయితే అభిమానులు ఫుల్లు ఖుషీ అయిపోతారు. తన క్యూట్ చిన్నారి అర్హని ఆడిస్తూ.. నేను తెచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకో.. అంటే నేను చేసుకోను అని ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే నాన్న బన్నీ కంటే మనక్కూడా ఎంత ముద్దుగానో అనిపించింది.

చిన్నారులతో ఆడుకోవడం ఎంత ఆనందాన్నిస్తుందో తెలియజేస్తున్నాడు అల్లు అర్జున్. ఓ సినిమా సూపర్ డూపర్ హిట్టయినా అంత ఆనందం ఉండదేమో. అందుకే అలసిన శరీరం ఇంటికి వెళ్లగానే చిన్నారులను చూస్తే ఉత్సాహం వస్తుంది. వారితో కాసాపు గడిపితే టెన్షన్ అంతా హుష్ కాకి.

Recommended For You