‘యాత్ర’ మూవీ రివ్యూ

ys-rajasekhara-reddy-biopic-yatra-telugu-movie-review

తెలుగు రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ముద్రలు ఎప్పటికీ చెరిగిపోవు. ఆ యాత్రను బేస్ చేసుకొని రాజశేఖర్ రెడ్డి జీవితంను ఆవిష్కరించే ప్రయత్నమే యాత్ర. బయోపిక్ ల వేడి వెండితెరమీద కొనసాగుతున్న ట్రెండ్ లో యాత్ర ఎలాంటి ప్రభావం చూపించిందో తెలుసుకుందాం..

కథ:
వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ అనుకోవడానకి ఇది పూర్తి కథ కాదు. కానీ రాజశేఖర్ రెడ్డి జీవితంను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ చరిత్రను మార్చిన పాదయాత్రను బేస్ చేసుకున్న కథ. యాత్ర లో రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం ప్రశ్నార్ధకంగా టైం నుండి పాదయాత్రను మొదలు పెట్టి ముఖ్యమంత్రి స్థానాన్ని చేరేవరకూ ఆయన జీవితంలో జరిగిన ఆసక్తికర సన్నివేశాల సమాహారంగా ఈ కథ. పాదయాత్ర సమయంలో రాజశేఖర్ రెడ్డి ఫైట్ చేసింది అధికార పక్షంతోనా, స్వపక్షంతోనా అనేది తెలుసుకొవాల్సిన కథ.

కథనం:
వైయస్ చేసిన పాదయాత్రకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకస్థానం ఉంది. రాయలసీమ నాయకుడిగా మాత్రమే పేరుగడించిన వైయస్ ఆర్ ను రాష్ట్ర నాయకుడిగా మార్చిన పాదయాత్ర ను ఇతి వృత్తంగా తీసుకున్న దర్శకుడు ఆ పాత్రకు మమ్ముట్టిని ఒప్పించడంలో మొదటి విజయం సాధించాడు. టాప్ క్లాస్ నటనతో మమ్మట్టి కనబరిచిన ప్రతిభ వైయస్ఆర్ పాత్రకు హుందాతనం తెచ్చింది. పాలిటిక్స్ తక్కువుగా రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ఎక్కువుగా చూపించాడు దర్శకుడు. తన ప్రాతంలో ఉప ఎన్నికలు వస్తే ఏవర్ని నిలబెట్టాలి అనే విషయంలో రాజశేఖర్ రెడ్డి చూపించిన నాయకత్వ లక్షణాలతో మొదలైన సినిమా ఆ సన్నివేశంతో రాజశేఖర్ రెడ్డికి ఆ ప్రాంతం పై ఉండే పట్టు, పలుకుబడిని ఒక రేంజ్ లో చూపాయి. ఒక కమర్షియల్ సినిమాకి ఏమాత్రం తగ్గని టెంపోని ఆ సన్నివేశంలో చూపించాడు దర్శకుడు. రాజకీయ జీవితంలో ప్రశ్నార్దకంలో పడినప్పుడు రాజశేఖర్ రెడ్డి ముందు ఉన్న దారులలో ఒకటి పాదయాత్ర. ఆ సన్నివేశంలో రాజశేఖర్ పాత్రలోని స్ట్రగుల్ ని చూపించాడు దర్శకుడు.

గట్టి పోటీ కూడా ఇవ్వలేని పార్టీ లో ఉండి. సొంత పార్టీలో ఉన్న వ్యతిరేకతను తట్టుకొని రాజశేఖర్ రెడ్డి వేసిన అడుగులు ఎలాంటి మలుపులు తిప్పాయి అనే కథనం ఆసక్తికరంగా మలిచాడు. ఒక రాజకీయ నాయకుడిగా మొదలైన యాత్ర నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేది పాదయాత్ర ప్రతి మలుపులో ఒక సమస్యను తీసుకొని దానికి పరిష్కారంగా పుట్టిన పథకాలను చూపించాడు దర్శకుడు. ఒక పొలిటకల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కి తెలుగులో కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వవు. కానీ యాత్ర ను పొలిటకల్ సబ్జెక్ట్ లా కాకుండా ఒక ఎమోషనల్ డ్రైవ్ గా మలిచాడు దర్శకుడు. వృధ్యాప్య పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీంబర్సెమెంట్ వంటి పథకాలు పాదయాత్రనుండి పుట్టినవే అన్నట్లు గా సన్నివేశాలను జతచేయడంలో దర్శకుడు విజయంసాదించాడు. మనిషిని నమ్మతే అతని కోసం ఎంత దూరం అయినా వేళ్ళే నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని వెండితెరమీద వెలిగించాడు. కెవిపీ తో ఉన్న అనుబంధం నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరం అయినా వెళ్ళే మనస్థత్వం రాజశేఖర్ రెడ్డి ని నాయకుడిగా ఎందుకు అభిమానిస్తారో అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాయి. హైకమాండ్ రాజశేఖర్ రెడ్డికి సపోర్ట్ చేసిందా..? లేదా అతని బలం మీద రాజకీయం చేసిందా..? అనే విషయాలు ఓపెన్ గా చర్చించాడు దర్శకుడు. పార్టీలో ఎదగడం కంటే పార్టీని మించి ఎదగడం, పార్టీలకు అతీతంగా ప్రజలతో మమేకం అవడం ఒక నాయకుడికి ఎంత అవసరమో రాజశేఖర్ రెడ్డి జీవితంతో గుర్తు చేశాడు దర్శకుడు. ఆరోగ్యశ్రీ పథకం రూపు దిద్దుకునేందుకు ముందు హాస్పటల్ లో ఒక సన్నివేశం ను హృద్యంగా మలిచాడు.

ఆ సన్నివేశంకు కళ్యాణి బలంగా మారింది. సబిత పాత్రలో సుహాసిని ఆ పాత్రకు హాందాతనం అందజేసింది. కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలు ఏ మాత్రం మోహమాటం లేకుండా చూపెట్టాడు దర్శకుడు. ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అనే మాటలు చాలా బలంగా వినిపించాడు దర్శకుడు. రైతులను నేరస్థులుగా చూస్తుందా నీ ప్రభుత్వం అని పోలీసులను ప్రశ్నించే సన్నివేశం చాలా బాగా డిజైన్ చేసాడు. ఎక్కువ పొలిటికల్ వార్ జోలికి వెళ్ళకుండా రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో రాష్ట్రనాయకుడిగా ఎలా అవతరించాడు అనే విషయం పై ఫోకస్ చేసాడు. టిడిపి ను గుర్తుకు తెచ్చే మనదేశం పార్టీ కంటే సొంత పార్టీలోనే వైయస్ఆర్ కి శత్రువులు ఎక్కువ అనిపించే విధంగా కథనం సాగింది. యాత్రకు ప్రధాన ఆకర్షణగా మమ్మట్టి నిలుస్తాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. తన సహాజ నటనతో, గంభీర మైన గొంతుతో ఆ పాత్రకు ప్రాణం పోసాడు. చివరిలో రాజశేఖర్ రెడ్డి ఒరిజనల్ విజువల్స్ తో పెంచెల్ దాస్ పాడిన ‘మరగైనావా రాజన్నా’ పాట బలమైన భావోద్వేగాలను నింపింది. ఇది దర్శకుడు బ్రిలియెన్సీ .. ఒక కథను ఎలా ముగించాలో తెలిసిన రాఘవ వైయస్ ఆర్ కి నిజమైన నివాళినిచ్చాడు. ఆ పాత్రకు ప్రాణం పోసిన మమ్మట్టి రాజశేఖర్ రెడ్డి చరిత్రలో భాగం అయ్యాడు.

చివరిగా:
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథను బలమైన భావోద్వేగాలతో నింపాడు దర్శకుడు. రాజశేఖర్ రెడ్డి అభిమానులకు యాత్ర ప్రత్యేకంగా నిలుస్తుంది.

Recommended For You