సిద్ధిపేటలో భారీ అగ్ని ప్రమాదం

huge fire accident in siddipet

సిద్ధిపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని ఓ వెదరు బొంగుల దుకాణంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు పక్కనే ఉన్న షాపులకు వ్యాపించాయి. దీంతో సమీపంలోని 12 దుకాణాలు అగ్నిలో చిక్కుకుపోయాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ప్రస్తుతం రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది.

Also read : సెల్ఫీలు తీసుకుంటున్నారా.. అయితే రోగాలను కొనితెచ్చుకున్నట్లే..

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. పట్టణంలోని మోడల్ రైతు బజార్ ఎదురుగా ఆరు కుటుంబాలు వెదురు బొంగులు, తడకల వ్యాపారంలో ఉన్నాయి. ఆ ఆరు కుటుంబాల్లో ఒకరింట్లో షార్ట్ సర్క్యూట్ జరగటంతోనే మంటలు చెలరేగినట్లు అంచనాకు వచ్చారు. అయితే..స్థానికులు కొంత వెదురును తొలగించినప్పటికీ మంటలను అదుపు చేయలేకపోయారు.

ఈ ప్రమాదంలో కొన్ని దుకాణాలు పూర్తిగా దగ్థమయ్యాయి. సరిపడ ఫైరింజన్లు అందుబాటులో లేకపోవటంతో ప్రమాద తీవ్రత పెరుగుతోంది. రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.