దొంగలను కాపాడేందుకు ధర్నా చేసిన తొలి సీఎం ఆమె.. – మోడీ

pm modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌పై దృష్టి పెట్టారు. వారంలో మూడోసారి ఆ రాష్ట్రంలో పర్యటించారు. జల్‌పాయిగురిలో నాలుగు రహదారుల హైవేకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై ఘాటుగా విమర్శలు గుప్పించారు.

పేద ప్రజలను దోచుకున్న వారికి మద్దతుగా ఓ ముఖ్యమంత్రి ధర్నాకు దిగడం ఇదే మొదటిసారని… ఈ రాష్ట్ర ప్రభుత్వం హింసాయుత సంస్కృతిని అవలంబిస్తోందని విమర్శించారు ప్రధాని మోడీ. దీదీ ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారని… పశ్చిమ బెంగాల్లో ఉన్న పరిస్థితుల గురించి మాత్రం ఆమె పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హింసాయుత వాతావరణాన్నే ఆమె ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ముమ్మారు తలాక్‌ రద్దు బిల్లుకి మమతా బెనర్జీ కూడా ఎందుకు మద్దతు తెలపట్లేదని… ఆమె ముస్లిం మహిళలకు ఎందుకు వ్యతిరేకం?’’ అని మోడీ ప్రశ్నించారు.

Also Read : మాయావతికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

ఇటీవలి శాసన సభ ఎన్నికల్లో పరాజయం పాలైన ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. కాంగ్రెస్ అగ్ర నేతల్లో చాలా మంది చట్టపరమైన చిక్కుల్లో ఉన్నారని ఆరోపించారు. రాయ్‌గఢ్ జిల్లా కొడతరాయ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన .. ఆ కుటుంబంలోని అత్యధికులు బెయిలుపై కానీ, ముందస్తు బెయిలుపై కానీ ఉన్నారని… వారు చట్టపరమైన చిక్కుల్లో ఉన్నారని సోనియా, రాహుల్‌ను ఉద్దేశించి విమర్శలు కురిపించారు. ప్రతిపక్షాల మహాకూటమిపై కూడా మోదీ విరుచుకుపడ్డారు. అది మహాకూటమి కాదని, మహా కల్తీ అని మండిపడ్డారు.

కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌, జైన్‌పూర్‌ జిల్లాల్లో పర్యటించిన ఆయన.. బీఎస్పీ-ఎస్పీ కూటమిని చూసి బీజేపీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో 50 శాతం ఓట్లను రాబట్టేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. గతంలో ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాల హయాంలో తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని… అప్పట్లో ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు ఉండేవన్నారు.

రాజ వంశాలకు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ ప్రాధాన్యతనిస్తుందని.. కానీ, బీజేపీ అలా కాదు.. ప్రజాస్వామ్యం ఆధారంగా నడుచుకుంటుందన్నారు అమిత్‌ షా. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. దేశ భద్రత మరింత పటిష్టమైందన్నారు.

Recommended For You