సెల్ఫీలు దిగుతున్నారా?.. ఒక్క క్షణం..

సెల్ఫీలు మనిషి జీవితంలో ఓ భాగమైపోయాయి. తమ తాము తమ రూపాన్ని సెల్ఫీల్లో బంధించేందుకు నేటి యువత తెగ ఉత్సాహం చూపిస్తుంది. ఏ పని చేసినా సెల్ఫీ దిగాల్సిందే. అంతలా సెల్ఫీతో అడిక్టైపోయింది నేటి యువత. ఎంతో ఆనందాన్నిచ్చే ఈ సెల్ఫీలు ఇప్పుడు ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని.. సామాజిక, మానసిక రుగ్మతలు తలెత్తుతున్నాయని తేలింది. అంతే కాదు ఎక్కువశాతం కాస్మోటిక్‌ సర్జరీలకు అవే కారణం అని అధ్యయనంలో తేలింది.

కాస్మోటిక్‌ సర్జరీలు చేసే ఈస్థటిక్‌ క్లినిక్స్‌ ఆధ్వర్యంలో ఢిల్లీ, హైదరాబాద్‌, ముంబయి, కోల్‌కతా నగరాల్లో అధ్యయనం నిర్వహించారు. ఒక్కో నగరంలో 75 మందిపై ఈ అధ్యయనం చేశారు. ముఖ్యంగా సెల్ఫీలు తీసుకున్న తర్వాత వాటిని చాలామంది వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. కొన్నిసార్లు వాటికి లైక్‌లు, కామెంట్లు రాకపోయినా తాము అందంగా లేమని భావిస్తున్నారట. దీంతో వారంత ఆత్మన్యూనతకు లోనవుతున్నారని తేలింది.

Also Read : పదహారేళ్ల అమ్మాయి సమాజం కోసం..

ఇక సెల్‌ఫోన్‌ కెమెరాల్లో తీసుకొనే సెల్ఫీల్లో కాస్త భిన్నంగా కన్పిస్తుంటారు. దాంతో ముఖ కవళికలు మారిపోయాయని.. తమ అందం దెబ్బతిందని చాలామంది తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారట. అంతే కాదు ఫొటోలను రకరకాల రూపాల్లోకి మార్చుకునే వెసులుబాటును ప్రస్తుతం అనేక యాప్‌లు కల్పిస్తున్నాయి. చాలామంది వీటి ద్వారా రకరకాలుగా మార్చుకుంటున్నారు. అలా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. వీలు కాకపోవడంతో ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నారని ఈ అధ్యయనంలో తేలింది.

తరచూ సెల్ఫీలు తీసుకునే వారిలో మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. సెల్ఫీలు తీసుకుంటూ చాలామంది ప్రమాదాల బారిన పడుతుండటం ఇప్పటికే చూస్తున్నాం. సెల్ఫీలు వ్యక్తిగతంగా, సామాజికంగా కూడా సమస్యలకు కారణమవుతున్నాయి. అందంపై శ్రద్ధ పెరిగి అది కాస్మోటిక్‌ సర్జరీలకు దారి తీసున్నాయి. గతంతో పోలిస్తే ఇవి 10 నుంచి 15 శాతం పెరిగడం ఆందోళన కలిగస్తున్న అంశం.

Recommended For You