అమెరికాలో విజయవంతంగా ‘యాత్ర’

yatra movie updates

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన యాత్ర సినిమా అమెరికాలో రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. యాత్ర సినిమాను చూసేందుకు ప్రవాస తెలుగువారు ధియేటర్లవద్దకు భారీగా తరలివస్తున్నారు. దీనిలో భాగంగా న్యూజెర్సీలో వైఎస్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు వందలాదిమంది పాదయాత్ర చేస్తూ ధియేటర్ కు చేరకున్నారు. యాత్ర సినిమా చాలా భాగుందని. వైఎస్ చేపట్టిన కార్యక్రమాలు తెలుసుకునేందుకు ఇది ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. సినిమాను అద్భుతంగా నిర్మించిన దర్శక, నిర్మాతలను వారు అభినందించారు.