నటి ఆత్మహత్య కేసు.. పోలీసుల అదుపులో సూర్య..

tv-actor-jhansi-suicide-updates

టీవీ ఆర్టిస్ట్‌ ఝూన్సీ ఆత్మహత్య కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ఈకేసులో ఝాన్సీ తల్లి అన్నపూర్ణ, సోదరుడు వాంగ్మూలాలను పంజాగుట్ట పోలీసులు రికార్డు చేశారు. తన కుమార్తె ఆత్మహత్యకు సూర్య తేజ వేధింపులే కారణమని వారు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెప్పారు. ఝాన్సీ ఆత్మహత్యకు కారణమైన సూర్య తేజపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరింది ఝూన్సీ తల్లి అన్నపూర్ణ.

Also Read : ప్రముఖ నటుడు మృతి..కుళ్లిపోయిన స్థితిలో శవం

ఝూన్సీ తల్లి , బంధువుల ఫిర్యాదు మేరకు సూర్యతేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఝాన్సీ, సూర్యల మధ్య ప్రేమ వ్యవహారంపై విచారణ చేపట్టారు. వారి మధ్య జరిగిన వాట్సప్‌ సంభాషణపై వివరాలను రాబడుతున్నారు. అతని వద్ద ఉన్న రెండు మొబైల్స్‌ను స్వాధీనం చేసుకుని వారి మధ్య జరిగిన కాల్ డేటా, వాట్సప్‌ మేసేజ్‌లపై విచారణ జరుపుతున్నారు పోలీసులు.

Recommended For You