భార్య, కొడుకును చంపి.. తగులబెట్టిన కసాయి భర్త

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కడతేర్చాడో కసాయి భర్త. భార్యతో పాటు ఆరు నెలల కన్న కొడుకును కూడా హత్య చేసి తగలబెట్టాడు. మేడ్చేల్ జిల్లా ఘట్ కేసర్ మండలం కొండాపూర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. భార్య, కొడుకును చంపిన భర్త ఆ తర్వాత పోలీసులు ఎదుట లొంగిపోవటంతో జంట హత్యల విషయం బయటపడింది.

జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడూరు గ్రామానికి చెందిన రమేష్..వరంగల్ జిల్లా బొల్లికుంటకు చెందిన సుశ్రుతను 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. సుశ్రుత ఎస్సీ కాగా.. రమేష్ ది పద్మశాలి సామాజిక వర్గం. అయితే.. గొడవల కారణంగా ఎనిమిది నెలల నుంచి వీరిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. అప్పటికే గర్భవతి అయిన సుశ్రుత ఆరు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇద్దరి మధ్య రాజీ ప్రయత్నాలు జరిగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందాం అంటూ భార్యను ఉప్పల్ పిలిపించాడు రమేష్.

Also Read : దారుణం.. భార్యపై అనుమానంతో..

ఉప్పల్ కు వచ్చిన సుశ్రుతను ఘట్ కేసర్ ఔటర్ రింగు రోడ్డు ప్రాంతంలోకి తీసుకెళ్లాడు రమేష్. ఇద్దరి మధ్య మళ్లీ పాతగొడవల ప్రస్తావన రావటంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సుశ్రీత నిద్రమాత్రలు మిగింది. బాబుకు కూడా పాలతో పట్టించింది. ఆ ఇద్దరు నిద్రలోకి జారుకుంటూ ఉండగానే కొండాపూర్ ప్రాంగణానికి తీసుకొచ్చిన రమేష్.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత సమీపంలోని బంక్ లో పెట్రోల్ తీసుకొచ్చి కాల్చేశాడు.

Recommended For You