చెట్టుకు ఉరి వేసుకొని ప్రేమ జంట సూసైడ్

అనంతపురం జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసింది. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో బోయ లోకేష్, వన్నూరమ్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో చోటు చేసుకుంది.

Also Read : దారుణం: భార్యపై అనుమానంతో..

గతంలో కూడా ఈ ప్రేమజంట పారిపోయి వివాహం చేసుకోవాలని ప్రయత్నించగా.. మరల వారిద్దరిని తీసుకువచ్చారు వారి బంధువులు. ఇద్దరిని తీవ్రంగా మందలించారు. వన్నూరమ్మకు పెళ్లి చేయాలని వారి తల్లిదండ్రులు నిర్ణయించారు.. ఈనేపథ్యంలో ఆదివారం పాలవాయి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఈ ప్రేమ జంట. సంఘటన ప్రదేశం చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recommended For You