సింగిల్ పీస్ ఇక్కడ.. జీవితాంతం కన్నెగానే.. – సాయిపల్లవి

తన అందం, అభినయంతో యూత్‌ మనసుని కొల్లగొట్టింది మలయాళం మల్లర్ సాయిపల్లవి. ‘భానుమతి ఇక్కడ.. సింగిల్ పీస్.. హైబ్రీడ్ పిల్ల’.. అంటూ కుర్రకారుని ‘ఫిదా’ చేసింది ఈ బ్యూటీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ మూవీ హిట్‌ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది సాయిపల్లవి. మలయాళంలో మల్లర్‌గా, తెలుగులో భానుమతిగా, తమిళంలో రౌడి బేబిగా సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన డాన్స్‌తో అభిమానులను అలరిస్తూ.. వెండితెరపై దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తన పెళ్లిపై షాకింగ్ కామెంట్ చేసింది.

Also Read : సౌందర్య ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌.. తలైవా స్టెప్పులు అదుర్స్..

తనకు పెళ్లిపై నమ్మకం లేదని, అసలు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఓ ఇంటర్వూలో చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది సాయి పల్లవి. ఎప్పటికీ సింగిల్‌గానే ఉండి, తన తల్లిదండ్రులను చూసుకోవాలని అనుకుంటున్నానని తెలిపింది. దీంతో తన పెళ్లిపై సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.