చంద్రబాబుకు అమిత్‌షా లేఖ.. అందుకే కడప ఉక్కు కర్మాగారాన్ని చేపట్టలేకపోయాం

amith-shaw-election-campaining-in-telangana

ధర్మపోరాట దీక్షతో ఢిల్లీ దద్దరిల్లేలా చేసిన చంద్రబాబుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగ లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో గెలవలేమనే భయంతో యూటర్న్‌ తీసుకున్నారని ఆరోపించారు. ఎప్పుడూ హెడ్‌లైన్లలో నిలిచే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవాచేశారు. ప్రధానమంత్రి వస్తే కనీసం గౌరవించలేని, విజ్ఞత లేని వ్యక్తి అంటూ అమిత్‌షా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పంచన చేరారని… చంద్రబాబు రక్తంలో ఇంకా కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తోందని లేఖలో అన్నారాయన. అబద్ధాలు చెప్పే సంస్కృతిని అమలు చేస్తున్నారని షా ఆరోపించారు. ఎన్నికల స్టంట్‌లో భాగంగా వరుస శంకుస్థాపనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలోని చాలా వాగ్దానాలను నాలుగేళ్లలోనే మోడీ ప్రభుత్వం పూర్తి చేసిందని పాతపాట పాడారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వనందు వల్లే కడప ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం చేపట్టలేకపోయిందని అమిత్‌షా చెప్పుకొచ్చారు.

Recommended For You