
ఇప్పటికే వృద్ధులకు పింఛన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు 10 వేలు సాయం, ఉద్యోగులకు మధ్యంతర భృతి వంటి నిర్ణయాలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం తాజగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గిరిజనులకు 50 ఏళ్ల నుంచే వృద్ధాప్య ఫించన్ ఇవ్వనున్నట్లు సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు 65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే లబ్దిదారులు వివరాలు నమోదు చేయాలని ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రభుత్వ ప్రకటనతో గిరిజనుల్లో ఆనందం వెల్లివిరిసింది.