
ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఘాటు లేఖ రాశారు. ఓటమిని ఎదుర్కోగల గుండె ధైర్యం మోదీలో పెరిగాలని దేవుణ్ణి ప్రార్థించారు చంద్రబాబు. పతనావస్థలోకి జారుకున్న మోదీ….. సంయమనం కోల్పోవడం సహజమేనంటూ ఐదు పేజీలో లేఖలో పేర్కొన్నారు. అడుగు పెడితే నిరసనలు ఎదుర్కోనే దుస్థితి అత్యున్నత పదవిలో ఉండేవారికి కలగరాదని ఆ లేఖలో తెలిపారు చంద్రబాబు.
Also read : రాజమహేంద్రవరంలో ఎన్నికలకు ముందే అంతర్గత పోరు
ప్రధాని పర్యటన వేళ ఆహ్వాన ప్రకటనల్లో సీఎం పేరు కూడా వేయని దుష్ట సంస్కృతికి మోదీ తెరతీశారని మండిపడ్డారు. హోదా కోసం ఆత్మహత్యలు చేసుకున్నవారికి సానుభూతి కూడా వ్యక్తం చేయలేదంటూ లేఖలో పేర్కొన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ లక్షకోట్ల అవినీతి పరుడని నిందించి, తిరిగి ఆయననే ఒడిలో కూర్చుబెట్టుకున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు.
మరోవైపు ఢిల్లీలో జరిగే ధర్మపోరాట దీక్షకు హాజరై మద్దతు తెలిపాలంటూ… పలువురు జాతీయ నేతలకు సైతం లేఖ రాశారు చంద్రబాబు. ఇప్పటికే హస్తినకు చేరుకున్న ఆయన… కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ, డీఎంకే నేత కనిమోళి, ఎస్పీ అగ్రనేత ములాయం సింగ్, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా, బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు పలువురు జాతీయ నేతలకు లేఖలు రాశారు.