పిల్లల తల్లో పేలు.. పోయేదెలా..

రోజూ హడావిడిగా స్కూలుకి వెళ్లడం. ఎవరి తలలో అయినా పేలుంటే ఎక్కించుకు రావడం. దువ్వడానికి టైం ఉండట్లేదు. పేలేమో పెరిగిపోతున్నాయి. పిల్లలున్న ప్రతి ఇంట్లో ఇదో పెద్ద సమస్యగా ఉంటుంది. అందుకు ఓ చక్కని ఇంటి వైద్యం పని చేస్తుందంటున్నారు వైద్యులు. ఒక్క పేలకే కాదు మరెన్నింటికో మందులా పని చేసే కర్పూరం గురించి తెలుసుకుందాం.
ఇంటి మూలల్లో కర్పూరం బిళ్లలు ఉంచితే సూక్ష్మక్రిములు, చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి.
జలుబుతో ఇబ్బంది పడే చిన్నారులకు కొబ్బరినూనెలో కర్పూరాన్ని వేసి బాగా కలిపి దాన్ని తీసుకుని ఛాతిమీద రాస్తుంటే జలుబు దగ్గుతుంది.


కప్పు నీటిలో కర్పూరం బిళ్లలు వేసి వుంచితే దోమలు నశిస్తాయి.
అదేవిధంగా ఇళ్లు తడిబట్టతో తుడిచేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా కర్పూరం వేసి తుడిస్తే ఈగలు రావు.
తమలపాకులో కర్పూరం వేసి తీసుకుంటే వేడి తగ్గుతుంది.
రోజుకి కొంత మోతాదులో కర్పూరం తీసుకుంటే లైంగిక సమస్యలు తగ్గుతాయి. వీర్యవ‌ద్ధి పెరుగుతుంది.
స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకుని చేస్తే చర్మసమస్యలు ఉండవు.


కర్పూరం రోజూ కొద్దిగా తీసుకుంటే బీపీ కూడా అదుపులో ఉంటుంది.
సౌందర్య పోషణలోనూ సహజంగా పని చేస్తుంది. నిమ్మరసంలో కర్పూరం కలిపి రాయడం వల్ల మొటిమలు, మచ్చల వంటి సమస్యలు తగ్గిపోతాయి.
కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి రాస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
తలలో పేలు ఎక్కువగా ఉంటే చిన్నారులు చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు కొబ్బరి నూనె వేడి చేసి అందులో కొద్దిగా కర్పూరం వేసి వారానికి ఒకసారి రాస్తుంటే పేల సమస్య తగ్గిపోతుంది. అయితే పావుగంట కంటే ఎక్కువ సేపు ఉంచవద్దు.


పాదాల పగుళ్లకు కూడా కర్పూరం బాగా పనిచేస్తుంది. ఓ బకెట్ గోరువెచ్చని నీళ్లు తీసుకుని పాదాలు మునిగిలా ఉంచాలి. అందులో కర్పూరం వేసి ఓ పావుగంట సేపు ఉంచితే పగుళ్లు తగ్గుతాయి. నీరు వేడి తగ్గిన తరువాత పాదాలు బయటకు తీసి శుభ్రం చేసుకోవాలి.

Recommended For You