సభ నిర్వహించి ఏం సాధించారు: సీపీఐ

CPI

గుంటూరులో ప్రధాని మోడీ సభ నిర్వహించి ఏం సాధించారని ప్రశ్నించారు ఏపీ సీపీఐ, సీపీఎం కార్యదర్శులు రామకృష్ణ, మధు. గుంటూరు సభలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఒక్క ప్రకటన అయినా చేశారా అని నిలదీశారు. హోదా కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తుంటే..ఎలాంటి సమాధానం చెప్పకుండా మోడీ వెళ్లిపోవడం దారుణమన్నారు. ఏపీకి మోడీ ఎప్పుడు వచ్చినా ఇదే విధంగా నిరసనలు తెలుపుతామన్నారు రామకృష్ణ, మధు.

గుంటూరులో నన్నపనేని రాజకుమారి దీక్ష…

ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు మద్దతుగా గుంటూరు మార్కెట్‌ సెంటర్‌లో మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నన్నపనేని రాజకుమారి దీక్ష చేపట్టారు. నల్ల దుస్తులు ధరించి కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆంధ్ర ప్రజానీకం కోసం దీక్ష చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు తిట్టడానికే మోడీ ఏపీకి వచ్చారని.. గుంటూరు సభలో మోడీ దిగజారి మాట్లాడరని విమర్శించారు నన్నపనేని రాజకుమారి.

Recommended For You