ఢిల్లీలో ప్రారంభమైన ధర్మపోరాట దీక్ష

Dharmaparata deeksha started in Delhi

దేశ రాజకీయాల్లో ఢిల్లీలో ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీకి ఏపీ భవన్‌తో మూడు దశాబ్దాలుగా విడదీయరాని బంధం ఉంది. జాతీయ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించడంలో ప్రధాన వేదికగా ఏపీ భవన్ నిలిచింది. దీని దృష్టిలో ఉంచుకునే సీఎం చంద్రబాబు ఏపీ భవన్‌ వేదికగా చేసుకోని ప్రధాని మోడీ పాలనపై పోరు సాగిస్తున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా శంఖారావం పూరించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఏపీ భవన్‌ను వేదికగా ఉపయోగించుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో మరో మైలు రాయి నిలిచిపోయేలా ఢిల్లీలో సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేపట్టారు.

Also read : మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏపీ భవన్‌నే వేదికైంది. నాడు ఎన్టీఆర్‌ 1989లో ఏడు పార్టీలతో నేషనల్‌ ఫ్రంట్ ఏర్పాటు చేశారు .ఏపీ భవన్‌లోని గురజాడ కాన్ఫరెన్స్‌ హాల్‌, అంబేదర్కర్ ఆడిటోరియంలో కీలక చర్చలు జరిగాయి.

1996లోనూ యునైటెడ్ ప్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు ఏపీ భవన్‌లోనే పురుడు పోసుకుంది. అప్పటి ఎన్నికల్లో ఏపార్టీకీ సరైన మెజార్టీ రాకపోవడంతో 13 పార్టీలు ఏకమవ్వడంతో పాటు వాటితో వామపక్షాలు జతకట్టేందుకు ఇక్కడే చర్చలు జరిగాయి. అప్పటి చర్చల్లో సీఎం చంద్రబాబే కింగ్‌ మేకర్‌గా నిలిచారు..

ఇప్పడు అదే తరహాలో మోడీ సర్కార్‌ను గద్దె దించేందుకు సీఎం చంద్రబాబు ఏపీ భవన్‌ను వేదిక చేసుకోని పోరు సాగిస్తున్నారు. చంద్రబాబు చేపట్టిన ఈధర్మపోరాట దీక్షకు దాదాపు 23 పార్టీల నేతలు హాజరై సంఘీభావం ప్రకటించనున్నారు. ప్రతిపక్షాలను సంఘటితం చేసేలా ఈవేదిక దోహదం చేయనుంది.