చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంఘీభావం

ex prime minister manmohan sing visit chandrababunaidu dharmaporata deeksha

చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంఘీభావం తెలిపారు. రాష్ట్ర విభజన సమయలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై పార్లమెంట్ సాక్షిగానే గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. వాటికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటానికి తామంతా మద్దతిస్తున్నట్టు చెప్పారు. అప్పుడు విభజన హామీలకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని గుర్తు చేశారు.

Also read : ధర్మపోరాట సభలో నరేంద్రమోడీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

ఏపీకి ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇవ్వాలంటూ నాటి ప్రధానిగా మన్మోహన్ సింగే రాజ్యసభలో ప్రకటన చేశారు. ఐతే.. నరేంద్రమోడీ సర్కార్ ఈ హామీని పక్కకుపెట్టింది. ఈ విధానం సరికాదని మన్మోహన్ గతంలోనే ఆక్షేపించారు. ఏపీకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏపీ భవన్‌లో జరుగుతున్న దీక్షకు మన్మోహన్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ దీక్షా వేదికపై మరోసారి ఆయన ఏపీకి న్యాయం చేయాలని కేంద్రానికి సూచించారు.

Recommended For You