అతని వల్లే భారత్‌ ఓడింది : హర్భజన్‌

Bhajji blamed Karthik for not taking the crucial single in the last over.

చివరి టీ20 లో న్యూజిలాండ్‌పై భారత్ ఓటమి చెందడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఓటమికి దినేష్ కార్తీక్‌ను బాధ్యున్ని చేస్తూ సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అదే విధంగా సీనియర్ క్రికెటర్స్ కూడా అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. చివరి ఓవర్లో దినేశ్‌ కార్తీక్‌ సింగిల్‌ తీయకపోవడం తప్పేనని టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్‌ 4 పరుగుల తేడాతో ఓటిమి పాలై సిరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే.

ఓ జాతీయ మీడియాతో హర్భజన్‌ మ్యాచ్ ఓటమిపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు “కార్తీక్‌ చేసిన చిన్న పొరపాటు ఇండియా ఓటమికి కారణమైంది. ఆ ఒక్క పరుగు వల్లే భారత్ సీరిస్ కోల్పోయింది. కార్తీక్‌కు ఉన్న అతివిశ్వాసం మంచిది కాదు. అతనిపై ఉన్ననమ్మకం ఇతరులపై కూడా ఉండాలి. మ్యాచ్‌లో మరో బాట్స్‌మెన్ రాణిస్తున్నప్పడు వారికి అవకాశం ఇవ్వాలి. వికెట్ కీపర్ బాట్స్‌మెన్ చివరిలో ఆ పరుగు తీసి ఉంటే మ్యాచ్ ఫలితం భిన్నంగా ఉండేది. గతేడాది జరిగిన నిదహాస్‌ ట్రోఫి ఫైనల్లో కార్తీక్‌ సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించడంతో అతనికి ఫినిషర్‌ ట్యాగ్‌ వచ్చింది. కానీ అక్కడ బౌలింగ్ చేస్తుంది సౌమ్య సర్కార్‌ కానీ, టీమ్ సౌత్ కాదనే విషయాన్ని కార్తిక్ గుర్తించాలి. కృనాల్ బ్యా టింగ్ బాగానే ఆడుతున్నాడు. అంతకు ముందు సౌతీ వేసిన ఓవర్లో 18 పరుగులు రాబట్టాడు. అలాంటప్పుడు అతనికి అవకాశం ఇవ్వకుండా కార్తిక్ బ్యాటింగ్ చేయాలనుకోవడం పొరపాటే. కృనాల్‌కు అవకాశం ఇస్తే పరిస్థితి మరోలా ఉండేదెమో. ఏది ఏమైనా కార్తిక్ మాత్రం భారత్ గెలుపు అవకాశాలపై గండికొట్టాడని” పేర్కొన్నారు.

Recommended For You