కులాంతర వివాహం : భార్యను దారుణంగా హత్యచేసిన భర్త

husband killed the wife

జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడూరు గ్రామానికి చెందిన రమేష్..వరంగల్ జిల్లా బొల్లికుంటకు చెందిన సుశ్రుతను 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరిది కులాంతర వివాహం. సుశ్రుత ఎస్సీ కాగా.. రమేష్ ది పద్మశాలి సామాజిక వర్గం. అయితే..గొడవల కారణంగా ఎనిమిది నెలల నుంచి వీరిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. అప్పటికే గర్భవతి అయిన సుశ్రుత ఆరు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇద్దరి మధ్య రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందామంటూ భార్యను ఉప్పల్ పిలిపించుకున్నాడు భర్త రమేష్‌…

Also read : నటి ఝాన్సీ ఆత్మహత్యకు కారణం చెప్పిన సూర్య

ఉప్పల్ కు వచ్చిన సుశ్రుతను ఘట్ కేసర్ ఔటర్ రింగు రోడ్డు ప్రాంతంలోకి తీసుకెళ్లాడు ఇద్దరి మధ్య మళ్లీ పాతగొడవల ప్రస్తావన రావటంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అప్పటికే వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలను మింగింది సుశ్రీత. బాబుకు కూడా పాలతో పట్టించింది. ఆ ఇద్దరు నిద్రలోకి జారుకుంటూ ఉండగానే కొండాపూర్ ప్రాంగణానికి తీసుకొచ్చిన రమేష్… నేషనల్ హైవే పక్కనున్న ప్రభాకర్‌ ఎన్‌క్లేవ్‌లోకి తీసుకెళ్లి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత సమీపంలోని బంక్ లో పెట్రోల్ తీసుకొచ్చి కాల్చేశాడు.. ఆ తర్వాత.. పాలకుర్తి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు రమేష్‌. నిందితుడు సమాచారంతో.. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు….. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.