రాజమహేంద్రవరంలో ఎన్నికలకు ముందే అంతర్గత పోరు

రాజమహేంద్రవరంలో ఎన్నికలకు ముందు అంతర్గత పోరు కామనైపోయింది… అధికార, ప్రతిపక్ష పార్టీల అధిష్టానాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి… ప్రతి నియోజకవర్గంలోనూ వర్గాల్లోని నాయకుల మధ్య మాటల పోరును రగిలించింది… సీనియర్‌ నాయకులున్న రాజమండ్రిలో మొదటి నుంచి వర్గపోరు రాజ్యమేలడంతో ఎన్నోసార్లు అధిష్టానం కలుగచేసుకొని సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసింది.

Also read : ఢిల్లీకి చేరిన ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా పోరాటం

దేవాలయ కమిటీల సభ్యులుగా 28 మందిని ప్రకటించడంతో వివాదం మొదలైంది.. పదవులు ఆశించిన వారికి దక్కకపోవడంతో కార్యకర్తల నిరసనలు, నాయకుల మధ్య సయోధ్య లేని విషయాన్ని బయటపెడుతోంది… రెండు వర్గాల పోరు కారణంగానే కొందరికి పదవులు దొరికితే కొందరికి దక్కలేదు… రాజమహేంద్రవరంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాయకుల వర్గాలు వైరి వర్గాలుగా ఉన్నాయి… ఆదిరెడ్డి, గోరంట్ల వర్గీయులే కాదు గూడా చైర్మన్‌ గన్ని కృష్ణ వర్గీయులు ఈ కమిటీల ఏర్పాటు వివాదాల్లో ఉన్నారు….

పంపిన లిస్ట్‌ ఒకటైతే వచ్చిన పేర్లు మరొకటిగా ఉండటం, పదవులు కొందరికి దక్కడం కూడా నాయకుల్లో వివాదానికి కారణమైంది… ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం, హితకారిణి సమాజం, జీవ కారుణ్య సంఘంలో ఒక నాయకుడి అనుచరులుగా ఉన్న వారికి కమిటీల్లో స్తానం లభించిందని, ఆర్యాపురం దేవస్థానం విషయంలోనూ అదే జరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి… సోమాలమ్మ దేవస్థానం విషయంలోనూ నాయకుల ప్రయార్టీకి పోస్టులు లభించాయని నిబంధనలు అమలు చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. కొందరైతే స్థానికులకే పోస్టులివ్వాలంటూ ఆందోళనకు దిగారు..

రాజమండ్రి కమిటీల గోల ఇప్పటిదికాదు.. గతంలోనూ కమిటీల పేరుతో వివాదాల్లో నాయకులు చిక్కుకున్నారు. బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగా ఉన్న సమయంలోనూ ఏర్పడిన కమిటీలు అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.. అప్పటి నుంచి మూడుసార్లు కమిటీలను ఏర్పాటు చేయాలని లిస్టులు పంపినా మరోవర్గం నాయకులు నిలిపివేయడంతో కమిటీల ఏర్పాటు జరగలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ వస్తున్న తరుణంలో ఎండోమెంట్‌ కమిటీల లిస్టు హడావిడిగా చేశారని ఓ నాయకుడి వర్గానికే కొమ్ముకాశారని నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Recommended For You