బాలుడికి తొమ్మిదేళ్ళు..ఆమెకు 36 ఏళ్ళు..ఏడాది కాలంగా..

There was a dispute between the family of the survivor and the accused. (

తొమ్మిదేళ్ళ బాలుడిపై 36 ఏళ్ళ మహిళ లైంగిక దాడికి పాల్పడింది. ఈ సంఘటన కేరళలోని కోజీకోడ్‌లో చోటుచేసుకుంది. 12 నెలలుగా తనపై ఆ మహిళ లైంగిక
దాడి చేస్తున్నట్లు పోలీసులకు ఆ బాలుడు తెలిపాడు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం బాలుడు అనారోగ్యం కారణంతో స్థానిక డాక్టర్‌ను సంప్రదించినప్పుడు అతనిపై లైంగిక దాడినట్లు గుర్తించారు. ఏం జరిగిందని బాలుడుని విచారించగా ఆ మహిళ జరిపిన లైంగిక దాడిని డాక్టర్‌కు వివరించాడు. బాలుడు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన వైద్యుడు పోలీసులకు సమాచారం అందించారు. నిందితురాలును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఏడాది కాలంగా ఆమె బాలుడిపై అత్యాచారానికి పాల్పడుతున్నట్టు పోలీస్ విచారణలో తేలింది. దీంతో బాలుడు మానసిక పరిస్ధితిలో మార్పు వచ్చినట్లు ధృవీకరించారు.పిల్లాడు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సబ్ ఇన్స్పెక్టర్ బిన్ థామస్ మీడియాకు తెలిపారు.మరిన్ని వివరాలు తెలుసుకున్న అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. బాలుడు ప్యామీలితో నిందితురాలుకు వివదాలు ఉన్నట్లుగా సమాచారం.

Recommended For You