విద్యార్ధుల తప్పు ఏమీలేదు..అంతా వాళ్ళదే తప్పు

A.-P.-Jithender-Reddy

ఫార్మింగ్టన్ యూనివర్శిటీ వ్యవహారంలో అమెరికా పోలీసుల అదుపులో ఉన్న భారతీయ విద్యార్ధులను ఆదుకోవాలని టిఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి లోక్ సభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్ధులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన తల్లిదండ్రులను ఆవేదనకు గురిచేస్తుందని.. దీనిపై విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని విద్యార్ధులను ఆదుకోవాలని సూచించారు. లక్షల రూపాయలు అప్పలు చేసి అక్కడకు వెళ్లిన తర్వాత దొంగ యూనివర్శిటీలు అని తేలడం దురదృష్టకరమన్నారు. విద్యార్ధుల తప్పు లేదని.. దళారుల వల్ల మోసపోయారన్నారు.

Recommended For You