ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా : బుట్టా రేణుకా

BUTTA-RENUKA

ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలన్నారు టీడీపీ ఎంపీ బుట్టా రేణుకా. బడ్జెట్‌లో ఏపీకి ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం దారుణమన్నారు. లోక్‌సభలో ప్రసంగించిన బుట్టా రేణుకా…. వెనుక బడ్డ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కేంద్రం తీరని ద్రోహం చేసింది..

విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు. ఏపీకి కేంద్రం తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. కేంద్రం తీరును మరోసారి లోక్‌ సభలో ఎండగట్టారు రామ్మోహన్‌ నాయుడు. చంద్రబాబు ఎప్పుడు ఏపీ హక్కుల కోసం మాట్లాడారే తప్పా వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. గుంటూరు సభలో మోడీనే చంద్రబాబుపై వ్యక్తిగత దాడికి దిగారన్నారు రామ్మోహన్‌ నాయుడు

Recommended For You