ఘనంగా మొదలైన శ్రీశారదా చంద్రమౌళీశ్వర సమేత పరివారదేవతా శిలా ఉత్సవ ప్రతిష్టాపన

occation in visakha saradha peetam

విశాఖ శారదాపీఠంలో శ్రీశారదా చంద్రమౌళీశ్వర సమేత పరివారదేవతా శిలా ఉత్సవ ప్రతిష్టాపన ఘనంగా మొదలైంది… గణపతిపూజ, పుణ్యాహవచనంతో ఉత్సవాన్ని ప్రారంభించారు. విశాఖ శ్రీశారదా అమ్మవారిగా ఇక్కడ పీఠంలో కొలువై అనాదిగా పూజలందుకుంటోన్న అమ్మవారు రాజశ్యామల యంత్ర మహిమతో ఎంతో మహిమాన్వితురాలై విరాజిల్లుతోంది… ఆలయ పునఃప్రతిష్ట సందర్భంగా శ్రీ శారదా అమ్మవారికి రాజశ్యామల అమ్మవారి నామాన్ని కూడా జోడించి మరింత శక్తిని ఆవాహన చేయడం ఈ క్రతువులో ప్రత్యేకత…ఇందుకోసం చతుర్వేద రుగ్వేద పారాయణం, రాజశ్యామల యాగం, వనదుర్గమూల మంత్ర హోమాల ఏకకాలంలో నిర్వహించారు.

Also read : రాజమహేంద్రవరంలో ఎన్నికలకు ముందే అంతర్గత పోరు

జగద్గురు ఆదిశంకరాచార్యులు శృంగేరిలో ప్రతిష్టించిన దక్షిణామ్నాయపీఠానికి ఉపీఠంగా ప్రసిద్ధి చెందిన విశాఖ శ్రీ శారదాపీఠంలో కొలువుకాబోయే అమ్మవారు ఇకపై శ్రీ శారదా సహిత రాజశ్యామల అమ్మవారిగా భక్తులను అనుగ్రహించనుంది… అమ్వారితోపాటు చంద్రమౌళీశ్వర స్వామి, విజయగణపతి, వనదుర్గ అమ్వార్ల ప్రతిష్ట కూడా నిర్వహిస్తున్నారు… ఇందుకోసం చతుర్వేద వాహనాన్ని పండితులు ప్రారంభించారు…ఎంతో పవిత్రమైన ఈ క్రతువులో పాల్గొన్న వారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు…

మరోవైపు వసంత పచని సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు… బాసర అమ్మవారి ఆలయంలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిగినంత సంతృప్తి లభించిందని…. మంచి చదువులు చదివి వృద్ధిలోకి రావాలని చిన్నారుల తల్లిదండ్రులు ఆకాంక్షించారు…

ఈ కార్యక్రమంలో టీవీ5 చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, వైస్‌ చైర్మన్‌ సాంబశివరావులు హాజరయ్యారు… అనంరం స్వామిజీ నంచి తీర్థప్రసాదాలు, ఆశీస్సులు తీసుకున్నారు… ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సుబ్బిరామిరెడ్డి హాజరై స్వామీజీని దర్శించుకున్నారు… రెండో రోజు ఇవాళ శ్రీదాసాంజనేయ స్వామివారికి పంచామృతాభిషేకం, కృష్ణయజుర్వేద పారాయణం, యధావిధిగా రాజశ్యామల యాగం, వనదుర్గాయాగాలు జరుగుతాయి.

Recommended For You