సౌందర్య రజనీకాంత్‌ భావోద్వేగం.. కొడుకును ఒళ్ళో కూర్చోబెట్టుకొని..

Soundarya-Rajinikanth

రజీనికాంత్ చిన్న కూతురు సౌందర్య వివాహం సోమవారం విశాకన్‌ వనగమూడితో ఘనంగా జరిగింది. చెన్నైలోని ఎంఆర్సీ నగర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన పెళ్లి వేడుకలో సౌందర్య-విశాకన్‌ జంట ఒక్కటైంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే పెళ్లి అనంతరం సౌందర్య భావోద్యేగ పూరితమైన ట్విట్ పెట్టారు.

“నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ముగ్గురు..నాన్న..నా కుమారుడు..నా జీవితంలో అడుగు పెట్టిన నా విశాగన్‌’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు.పెళ్లిలో తీసిన కొన్ని ఫొటోలను సౌందర్య ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ ఫోటోలలో భావోద్వేగమైన సన్నివేశాలు కనిపించాయి. విశాకన్‌ తాళికట్టే సమయంలో సౌందర్య భావోద్వేగానికి గురయ్యారు.ఆమెతోపాటు లతా రజనీకాంత్‌, ఐశ్వర్య ధనుష్‌ కూడా కళ్లు చెమర్చారు. వీటితో పాటుగా.# మిస్టర్‌ అండ్‌ మిసెస్‌, #మేముఒక్కటే అనే హ్యాష్‌ ట్యాగ్‌తో భర్త, కుమారుడు, తండ్రితో కలిసి ఉన్న మరిన్ని ఫొటోలను ఆమె షేర్‌ చేశారు. ప్రతి సందర్భంలోను సౌందర్య కుమారుడిని వెంటబెట్టుకోనే ఉన్నారు. పెళ్ళి అనతరం కోడుకును ఒళ్ళో కూర్చుకోబెట్టుకొని సంబరపడిపోయారు

Recommended For You