సంబంధాలు చూస్తున్నాం.. క్యాస్ట్ విషయంలో పట్టింపు లేదు.. నాగబాబు

acter nagababu doughter niharika wedding may this year

త్వరలో నాగాబు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె నిహారికకు పెళ్లి చెయ్యాలని నాగబాబు భావిస్తున్నారట. ఇటీవల నాగబాబు ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక పెళ్లి విషయంపై మాట్లాడారు. తన కుమార్తె నిహారికకు ప్రస్తుతం పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, క్యాస్ట్ విషయంలో పెద్దగా పట్టింపు లేదని.. అబ్బాయి మంచివాడు, గుణవంతుడు సంప్రదాయ బద్దంగా ఉండాలని నాగబాబు అన్నారు. పెళ్లి విషయం రెండేళ్ల కిందటే నిహారికకు చెప్పినట్టు చెప్పారు. ఏదో తన ముచ్చట కాదనలేకే సినిమాల్లో నటించాడనికి ఒప్పుకున్నాను. మంచి సంబంధం కుదిరితే నిహా కు పెళ్లి చేస్తాము అని స్పష్టం చేశారు. దీంతో నాగబాబు ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయని అర్ధమవుతుంది.