పదో తరగతి పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల

andhrapradesh tenth class exam schedule is released

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. దాదాపు 6.10 లక్షల మంది ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ నెల 7 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 18 నుండి ఏప్రిల్‌ 2 వరకు మొత్తం 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని, నెల రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామని వెల్లడించారు. హాల్‌ టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా వెబ్‌సైట్‌ నుంచి డౌన్లోడ్‌ చేసుకోవచ్చని మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. ఉదయం గం.9.30ల నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు..

Also read : భార్యతో సహా లొంగిపోయిన మావోయిస్టు సుధాకర్‌

18/03/2019, ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (తెలుగు) పేపర్‌-1
19/03/2019 , ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (తెలుగు) పేపర్‌-2
20/03/2019, సెకండ్‌ లాంగ్వేజ్‌ (హిందీ)
22/03/2019, ఇంగ్లీష్‌ పేపర్‌-1
23/03/2019, ఇంగ్లీష్‌ పేపర్‌-2
25/03/2019, మ్యాథ్స్‌ పేపర్‌-1
26/03/2019, మ్యాథ్స్‌ పేపర్‌-2
27/03/2019, జనరల్‌ సైన్స్‌ పేపర్‌-1
28/03/2019, జనరల్‌ సైన్స్‌ పేపర్‌-2
29/03/2019, సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-1
30/03/2019, సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-2
పరీక్షల షెడ్యూల్‌ విడుదలవడంతో విద్యార్థుల హడావుడి మొదలైంది… ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టారు స్టూడెంట్స్‌.

Recommended For You