విభజన చట్టం అమలుపై రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు

విభజన హామీలను అమలు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ను కోరారు చంద్రబాబు నాయుడు. 18 డిమాండ్లతో వినతి పత్రాన్ని సమర్పించారు. హోదాతో పాటు విభజన చట్టం అమలు విషయంలో బీజేపీ ద్రోహం చేసిందని రాష్ట్రపతికి వివరించి చెప్పామని అన్నారు చంద్రబాబు నాయుడు.

ఏపీకి అన్యాయం చేసిన వ్యక్తి నరేంద్రమోడీ అంటూ ఫైర్‌ అయ్యారు చంద్రబాబు నాయుడు. కోట్లాది మంది ఏపీ ప్రజలను మోడీ వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల ప్రయోజనాలను కాలరాసే హక్కు ఆయనకు ఎక్కడుంది అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత ఏపీకి ఇచ్చిన హామీలు అన్నింటిని విస్మరించారని చంద్రబాబు అన్నారు.

Also Read : ఏపీ భవన్‌ నుంచి రాష్ట్రపతి భనవ్‌ వరకు ర్యాలీ చేపట్టిన సీఎం చంద్రబాబు

ప్రధాని ఏపీ పర్యటనకు తాను దూరంగా ఉండటం ముమ్మాటికి సబబేనని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రధాని పర్యటనలో ప్రోటోకాల్ పాటించామని గుర్తు చేశారు. ఆయితే..ఏపీకి ప్రజలకు ద్రోహం చేసిన మోడీ రాష్ట్రానికి వస్తే తాను ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. తన ప్రజలే తనకు ముఖ్యమని అన్నారాయన.

అటు జగన్‌ తీరుపైనా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వైసీపీకి జనంలో విశ్వాసం లేదని అన్నారు. బీజేపీ ఊడిగం చేస్తున్న జగన్..వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలన్నారు. హైదరాబాద్‌ లో ఉంటూ ఓట్ల కోసం అమరావతిలో రాజకీయం చేస్తామంటే ఏపీ ప్రజలు ఒప్పుకోరని అన్నారు చంద్రబాబు.

Recommended For You