జయరాం హత్య కేసు : రాకేష్ రెడ్డి, శిఖా చౌదరి కాల్ డేటా..

chigurupati jayaram murder case updates

ప్రముఖ వ్యాపారవేత్త NRI జయరాం మర్డర్ కేసులో చిక్కుముడులు విప్పేందుకు జూబ్లీహిల్స్‌ పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జయరాంను హత్య చేసింది రాకేష్ రెడ్డి, అతనికి సహాకారించిన వాచ్‌మెన్‌లు అని నిర్ధారించి.. ఆ ఇద్దరినీ నందిగామ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో మొదటి నుంచి వినిపించిన పేరు శిఖా చౌదరి.. అయితే ఆమెను విచారించి.. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో క్లీన్ చిట్ ఇచ్చారు ఏపీ పోలీసులు. దీంతో ఈకేసులో జయరాం భార్య పద్మశ్రీ శిఖా చౌదరిపై ఆరోపణలు చేశారు. జయరాం హత్య కేసులో శిఖా చౌదరితోపాటు తనకు అనేక అనుమానాలు ఉన్నాయని.. తెలంగాణ పోలీసులు విచారిస్తే.. తనకు న్యాయం జరుగుతుందని ఆమె డిమాండ్ చేశారు.

Also read : పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర జల వనరులశాఖ ఇచ్చిన లెక్కలు సహేతుకమైనవే..

వరుస ఆరోపణలతో ఏపీ పోలీసులు.. జయరాం కేసును హైదరాబాద్‌కు బదిలీ చేశారు. జుబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. ఇప్పటికే అరెస్టైన రాకేష్ రెడ్డీ, శ్రీనివాస్‌లను పీటీ వారంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు. ఎల్బీనగర్ హస్తినాపురంలోని నాంపల్లి కోర్టు జడ్జి ఇంటి ముందు నిందితులను ప్రవేశపెట్టారు. నిందితులకు 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఈ కేసులో జుబ్లీహిల్స్ పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ను వేయనున్నారు. ఇవాళ పిటిషన్ వేస్తే.. బుధవారం పిటిషన్‌కు నెంబర్ అయ్యే అవకాశం ఉంటుంది. గురువారం, శుక్రవారం రోజుల్లో పోలీసు కస్టడీ పిటిషన్‌పై పబ్లిక్ అడ్వకేట్ తోపాటు నిందితుల తరుపున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తారు. పోలీసులు 14 రోజుల పాటు నిందితులను కస్టడీకి ఇవ్వాలని జడ్జీని కోరే అవకాశం ఉంది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఇద్దరు నిందితులను ఐదు నుంచి ఏడు రోజుల వరకు పోలీసు కస్టడీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు న్యాయనిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రాకేష్ రెడ్డి, శిఖా చౌదరిల కాల్ డేటా తెప్పించారు పోలీసులు. పద్మశ్రీ స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఇద్దురు నిందితులను కోర్టు అనుమతితో కస్టడికి తీసుకున్న తర్వాత.. సీన్ ఆప్ అపెన్స్ ప్లేస్‌లో సీన్ రి కస్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. అలాగే రాకేష్ రెడ్డిని విచారించేటప్పుడు ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కోంటున్న శిఖా చౌదరికి సీఆర్పీ సీ సెక్షన్ 41 కింది నోటీసులు జారీ చేసి.. ఇద్దరిని ఒక్కేదగ్గర కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉంది. అయితే పోలీసు కస్టడీ విచారణలో నందిగామ పోలీసులు తేల్చిన విషయాలే రిపీట్ అవుతాయా.. లేక ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తాయా అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది.

Recommended For You