నేడు రాష్ట్రపతిని కలవనున్న సీఎం చంద్రబాబునాయుడు బృందం

cm chandrababunaidu confirmed four candidates in rajampeta parliament

కేంద్రంపై పోరాటంలో ఇంకాస్త దూకుడు పెంచుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హస్తిన వేదికగా 12 గంటల పాటు ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న చంద్రబాబు.. రెండో రోజూ ఢిల్లీలోనే ఉంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని 18 అంశాల అమలును కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వనున్నారు.

Also read : ఏపీలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 14న నోటిఫికేషన్‌

చంద్రబాబు నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింగ్‌ను ఇవాళ మధ్యాహ్నం కలవనున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రజా, విద్యార్థి, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి రాష్ట్రపతిని కలవాలని మొదట నిర్ణయించారు. రాష్ట్రపతి భవన్‌ కేవలం 11 మందికే అవకాశం ఇవ్వడంతో ఆ మేరకే నేతలను తీసుకెళ్లనున్నారు.

ఉదయం 10 గంటలకు ఏపీ భవన్‌ నుంచి ప్రదర్శనగా బయలుదేరి రాష్ట్రపతి భవన్‌కు చేరుకోనింది ముఖ్యమంత్రి బృందం. రాష్ట్రపతిని కలిసే బృందంలో ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, అమరావతి ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వరులు, ఆంధ్రా మేధావుల ఫోరం చైర్మన్‌ తలసాని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ జేఏసీ అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి, ఏపీ సినీ పరిశ్రమ ప్రతినిధి శివాజీలు ఈ బృందంలో ఉంటారు.

Recommended For You