ఆయన వైసీపీలోకి వెళతారా..?

ex mla ck babu maybe join in ysrcp

చిత్తూరు నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం రోజుకో ములుపు తిరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరు ఏపార్టీలో కొనసాగుతారన్నది అంతుచిక్కడం లేదు. త్వరలోనే కీలకమార్పులు తథ్యమంటున్నారు. చిత్తూరు మాజీ MLA సి.కె.బాబుపైనే ఉంది. ఆయన వైసీపీలో చేరతారంటూ ప్రచారం ఊపందుకుంది. కానీ సి.కె.బాబు అనుచరులు మాత్రం స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోనికి దిగుతారని చెబుతున్నారు. 1989లో కూడా సి.కె.బాబు ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీచేసి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. వైఎస్ కు దగ్గరయ్యారు. అయినా ఆయనకు పదవుల మాత్రం రాలేదు. అయితే రాష్ట్రవిభజన అనంతరం ప్రత్యక్ష రాజకీయలకు కొంతకాలం దూరంగా ఉన్న సీకే బాబు అనంతరం బిజేపిలో చేరారు. అయినప్పటికీ పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కమలం పార్టీకి దూరంగా వ్యక్తిగతంగానే ఆయన కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి ప్రచార రథాన్ని కూడా సిద్దం చేసుకున్నారు. అయితే వైసీపీ గూటికి చేరుతారని గుసగుసలు కలకలం రేపుతున్నాయి. ఒకవేళ సి.కె.బాబు వైసీపీలోకి వస్తే ఇప్పటికే ఇంఛార్జిగా ఉన్న జంగాలపల్లి శ్రీనివాసులు పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. ఆయన పార్టీలో ఉంటారా? ఉండరా అన్నది ఆసక్తిగా మారింది.

Also read : పార్లమెంట్‌ ముందుకు రాఫెల్ ‌డీల్‌ కాగ్ రిపోర్ట్

మరోవైపు టిడిపి నాయకుడు బెలెట్ సురేష్ కూడా పార్టీ మారుతున్నట్టు ప్రచారముంది. నియోజక వర్గంలో సురేష్ సామాజికవర్గం అయిన మొదలియార్స్ జనాభా ఎక్కువగానే ఉంది. ఎన్నికల జయాపజయాలు ప్రభావితం చేసేస్థాయిలో ఉన్నాయి. దీంతో ఆయన్ని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు నేతలు రంగంలోకి దిగారు. తన రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇస్తే పార్టీ మారడానికి సురేష్ సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. చిత్తూరు మేయర్ పదవిపై ఆయన కన్నేసినట్టు చెబుతున్నారు. ఇక సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ కూడా ఈసారి పోటీకి ఆసక్తిచూపడం లేదు. కుమారుడు బద్రికి అవకాశం ఇవ్వాలని ఆమె అధినేత వద్ద చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికలు సమీపించే కొద్ది చిత్తూరు నియోజక వర్గంలో ఆసక్తికర మార్పులు చోటు చేసుకోన్నున్నాయి.