భార్య గర్భవతి.. అనుమానంతో భర్త.. దారుణంగా..

husband killed the wife

మేడ్చల్‌ జిల్లా కొండాపూర్‌ ప్రాంతంలో జరిగిన తల్లి కొడుకుల హత్య కేసులో అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్యపై అనుమానం, బంధువుల నుంచి అవమానాలు ఎదురవటంతోనే భార్యను, కొడుకును హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. హంతకుడు రమేష్‌ తన భార్య పిల్లల్ని అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసులు ముందు అంగీకరించాడు.

జనగామ జిల్లా గూడూరుకు చెందిన రమేష్‌.. 2015లో సుశ్రుతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి కులాలు వేరు కావటంతో రమేష్‌ కుటుంబసభ్యులకు పెళ్లి నచ్చలేదు. అటు..భార్యతో తరచు గొడవ పడే వాడు రమేష్‌. గొడవలు ముదరటంతో ఎనిమిది నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. అయితే.. కోర్టులో చివరి వాయిదా సమయంలో తాను అయిదు నెలల గర్భవతినని శుశ్రుత చెప్పడంతో న్యాయస్థానం విడాకులు మంజూరు చేయకుండా నిలిపివేసింది.

Also Read : నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన ప్రేమ జంట ఏకాంతంలో ఉండగా..

ఈ జంట హత్యలు అవేశంలో జరిగిన హత్యలని తొలుత భావించినా..ఓ పథకం ప్రకారం కుట్ర చేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. భార్య గర్భవతి అని చెప్పటంతో అనుమానం పెంచుకున్నాడు రమేష్‌. దీనికితోడు.. కొడుకు నామకరణానికి వెళ్లిన తనను పట్టించుకోలేదంటూ రమేష్‌ గొడవ పడ్డాడు. ఇటు తన తమ్ముడి వివాహనికి కూడా రమేష్‌ ను పిలవలేదు. ‌తన కుటుంబసభ్యుల్లో చులకనవ్వటానికి భార్య సుశ్రుతే కారణమని కోపం పెంచుకున్నాడతను. ఓ పథకం ప్రకారం కలిసి ఉందామని నమ్మించాడు. ఉప్పల్‌ రప్పించి తల్లి కొడుకులను హత్య చేసి సాక్ష్యాలు దొరక్కుండా మృతదేహాలను తగలబెట్టాడు. కట్టుకున్న భార్యను, కన్నకొడుకును హత్య చేసిన రమేష్‌ ను కఠినంగా శిక్షించాలంటున్నారు సుశ్రుత కుటుంబసభ్యులు.