నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన ప్రేమ జంట ఏకాంతంలో ఉండగా..

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఉడా టౌన్‌ షిప్‌లో ప్రేమ జంటపై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడుతో దాడి చేశారు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాడేపల్లి మహానాడుకు చెందిన జ్యోతి, శ్రీనివాస్‌గా గుర్తించారు. పథకం ప్రకారం జరిగిందా… లేక ఆకతాయిలు ఇలా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి గుంటూరులో ‌ఫార్మసీ పూర్తి చేసిందని.. సర్టిఫికేట్స్‌ తీసుకొస్తానని చెప్పి.. ఇంట్లో నుంచి వచ్చిందని బంధువులు చెబుతున్నారు.

తాడేపల్లి మహానాడు ఏరియా వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన చుంచు శ్రీను, అంగడి జ్యోతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంకాలం మంగళగిరి మండల పరిధిలోని ఏసీఏ క్రికెట్‌ స్టేడియం వెనుక వైపు వున్న నిర్మానుష్య ప్రాంతానికి ప్రేమికులిద్దరూ వచ్చారు. వారు ఏకాంతంగా వున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు చుట్టుముట్టి రాడ్లతో దాడి చేశారు. ఇద్దరి తలపై రాడ్డుతో బలంగా పలుమార్లు మోదారు. తల నుంచి తీవ్ర రక్తస్రావం జరగడంతో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది.

Also Read : జయరాం హత్య కేసులో శిఖా చౌదరిని పోలీసులు..

శ్రీను కొన ఊపిరితో ఓపిక తెచ్చుకుని పోలీసులకు సమాచారం అందించినట్టు చెబుతున్నారు. సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్‌ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకుని ప్రియుడు శ్రీనును చికిత్స నిమిత్తం చినకాకాని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా వుంది. నార్త్‌ సబ్‌డివిజన్‌ డీఎస్పీ జి.రామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎన్నారైలో చికిత్స పొందుతున్న శ్రీనుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తమపై ఎంత మంది దాడి చేసింది, ఎందుకు చేశారో శ్రీను చెప్పలేకపోతున్నాడు. అతని బంధువులను పోలీసులు విచారిస్తున్నారు.

సర్టిఫికెట్ల కోసం సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఇంటి నుంచి బయటికి వచ్చినట్టు చెబుతున్నారు. ప్రేమజంటపై జరిగిన దాడి స్థానికంగా సంచలనం రేపింది. అయితే ఈ దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయాలు తెలియరాలేదు. ప్రేమికులిద్దరిదీ వేర్వేరు కులాలు కావడంతో ఇష్టంలేని కుటుంబ పెద్దలే ఈ దారుణనికి ఒడిగట్టారా లేక మరేమైనా పాత కక్షలు వున్నాయా అనేది తెలియాల్సి వుంది.

Also Read : కాపురానికి వెళ్లమన్నందుకు.. మహిళ చేసిన పని..

Recommended For You