భార్యతో సహా లొంగిపోయిన మావోయిస్టు సుధాకర్‌

maoist leader surrender

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఒక్కొక్కరుగా పోలీసులకు లొంగిపోతున్నారు.. తాజాగా కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్‌ రాంచీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సుధాకర్‌తోపాటు అతని భార్య మాధవి కూడా సరెండర్‌ అయ్యారు.. వీరిపై కోటి రూపాయల రివార్డ్‌ ఉంది….

Also read : ఈసారి బడ్జెట్‌ ఎవరు ప్రవేశపెడతారు..?

నిర్మల్ జిల్లా సారంగాపూర్‌కు చెందిన సుధాకర్ అలియాస్ కిరణ్ రాష్ట్ర కమిటీ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా అనేక సేవలు అందించారు. జార్ఖండ్ మావోయిస్టు కార్యక్రమాల్లో సుధాకర్ క్రియాశీలక పాత్ర పోషించారు. సుధాకర్, భార్య మాధవి 2013 నుంచి కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. అనారోగ్య కారణాల రీత్యా వీరిద్దరు లొంగిపోయారని తెలుస్తోంది.

మావోయిస్టు కార్యకలాపాల్లో సుధాకర్ చురుకుగా పాల్గొన్నాడు. అనేక ఎన్ కౌంటర్లలో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. సుధాకర్ పై కోటి రూపాయల రివార్డును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో కూడా వారిపై కేసులు ఉండటం వల్ల ఇక్కడికి తీసుకొచ్చి వారిని విచారించే అవకాశం ఉంది. అయితే విచారణ నిమిత్తం వారిని తెలంగాణకు పంపే విషయంలో జార్ఖండ్ పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

సుధాకర్‌ దంపతులు పోలీసులకు లొంగిపోవడంతో వారిపై ఉన్న కేసులన్నింటినీ కొట్టివేసే అవకాశం ఉంది. ఇవాళ మీడియా సమావేశం తరువాత పోలీసులు పూర్తి వివరాలు తెలిపే అవకాశం ఉంది.

Recommended For You