ఏపీలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 14న నోటిఫికేషన్‌

Notification for MLC empty seats in AP is on April 14

మార్చిలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 14న నోటిఫికేషన్‌ విడుదల కానుంది… కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలతోపాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి… అలాగే ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవనున్న మరో ఐదు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు…

Also read : ముగిసిన చంద్రబాబు ధర్మపోరాట దీక్ష

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు వర్తించే అవకాశముంది. దాదాపుగా సగం పైగా రాష్ట్రంలో మూడు రోజుల్లో కోడ్‌ అమల్లోకి రానుంది. ఇది దాదాపుగా ఈ నెలాఖరు వరకు ఉంటుంది. ఆ తరువాత మళ్లీ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది. ఫిబ్రవరి 28 లేక మార్చి 4వ తేదీన ఈ కోడ్‌ రావొచ్చని అంటున్నారు. ఫిబ్రవరి చివరిలోనే వస్తే, ఇటు ఎమ్మెల్సీల ఎన్నికల కోడ్‌, ఆ వెంటనే సాధారణ ఎన్నికల కోడ్‌ అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. మధ్యలో సమయం ఉండదు. ఒకవేళ మార్చి 4వ తేదీన సాధారణ ఎన్నికల ప్రకటన వస్తే మాత్రం కోడ్‌కు నాలుగైదు రోజుల విరామం మధ్యలో ఉంటుంది.