ఆ ఒక్క ఎమ్మెల్సీ గురించే కాంగ్రెస్‌లో చర్చ..

congress mp candidates in telangana

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్త‌మ‌వుతున్నతెలంగాణ కాంగ్రెస్ పార్టీలో .. ఇప్పుడు లోక్ స‌భ ఎన్నిక‌ల కంటే.. ఆ ఒక్క ఎమ్మెల్సీ స్థానంపైనే తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతోంది. మండ‌లిలో కేసీఆర్ వ్యూహంతో ఇప్పటికే కాంగ్రెస్ ఎల్పీ టీఆర్ఎస్ లో విలీనం అయిపోయింది. అయితే ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్క‌నుంది. ఈ స్థానంపైనే ఇప్పుడు పార్టీలో అంద‌రి చూపు కేంద్రీకృతమైంది.

పార్టీకి ద‌క్క‌నున్న ఆ ఒక్క ఎమ్మెల్సీ స్థానంపై నేత‌లు భారీగా ఆశ‌లు పెట్టుకున్నారు. ఆశావహుల్లో సీనియ‌ర్, జూనియ‌ర్ అన్న‌ తేడా లేకుండా.. ఎవ‌రికి వారు ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిన సీనియ‌ర్ నేత‌లు సైతం.. ఆ స్థానంపై తెగ ఆశ‌లు పెట్టుకున్నార‌ట‌. జానారెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, పొన్నాల ల‌క్ష్మ‌య్య, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, చిన్నారెడ్డి, ష‌బ్బీర్ అలీ, జీవ‌న్‌రెడ్డి, డి.కే అరుణ‌, గీతారెడ్డి, సునీత ల‌క్ష్మారెడ్డి, రేవంత్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్ ఇలా .. ఒకరేంటి.. ఎందరో ఉద్ధండులు ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ క్యూ కడుతున్నారు.

Also Read : భార్య గర్భవతి.. అనుమానంతో భర్త.. దారుణంగా..

ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలంటే 17 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. ప్ర‌స్తుతం కాంగ్రెస్ కు 19 మంది ఎమ్మెల్యేలున్నారు. సేఫ్ గా ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కించుకుంటే.. కూల్ గా ఆరేళ్ళు కుర్చీలో ఉండొచ్చ‌ని భావిస్తున్న సీనియ‌ర్ నేత‌లు.. ఎలాగైనా సాధించుకునేందుకు లాబీయింగ్ ముమ్మ‌రం చేశారు. ఇప్ప‌టికే చాలామంది నేత‌లు.. అదిష్టానం ముందు త‌మ విన్న‌పాన్ని వినిపించారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఆవ‌కాశం ద‌క్క‌ని నేత‌లు కూడా.. ఆ ఒకే ఒక్క ఛాన్స్‌ తమకే దక్కుతుందన్న ఆశ‌లో ఉన్నారు. ముఖ్యంగా స‌న‌త్ న‌గ‌ర్, క‌రీంన‌గ‌ర్ అసెంబ్లీ టికెట్ ల‌ను ఆశించి భంగ‌ప‌డిన మ‌ర్రిశ‌శిద‌ర్ రెడ్డి, నేరెళ్ల‌ శార‌ద… త‌మ‌కు ఈసారి అధిష్టానం న్యాయం చేస్తుంద‌న్న ఆశతో ఉన్నారు.

మొత్తానికి వ‌చ్చేది ఒకే ఒక్క ఎమ్మెల్సీ అయితే.. దాని ఆశావహుల లిస్ట్ మాత్రం చాంతడంత ఉంది. వీరిలో హైక‌మాండ్ క‌రుణ ఎవ‌రికి ద‌క్క‌తుంద‌న్న‌ది అత్యంత ఆస‌క్తిక‌రంగా మారింది.

Also Read : మోదీ ఎదుటే మహిళా మంత్రి నడుముపై పబ్లిక్‌గా..