సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్‌ నాగేశ్వర్రావుకు సుప్రీంకోర్టు అసాధారణ శిక్ష

SC convicts CBI additional director Nageswara Rao, legal advisor for contempt of court

సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్‌ నాగేశ్వర్రావుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సీనియర్ IPS అధికారి అయిన ఆయనకు అసాధాారణ శిక్ష విధించింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ షెల్టర్‌ హోం కేసుకు సంబంధించి విచారణ అధికారి అయిన అరుణ్‌ కుమార్ శర్మను ఆ బాధ్యతల నుంచి తప్పించడం, CRPF అదనపు డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేయడం నాగేశ్వర్రావుకు తిప్పలు తెచ్చిపెట్టింది.

గతంలో సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆస్తానా మధ్య చిచ్చు రాజుకున్నప్పుడు… తాత్కాలిక చీఫ్‌గా నాగేశ్వర్‌రావును నియమించారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ‌్యక్తంచేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌ అన్నారు. ఇందుకు శిక్ష తప్పదంటూ లక్ష రూపాయల ఫైన్ విధించారు. చీఫ్ జస్టిస్‌ కోర్టు రూమ్‌లో రోజంతా కూర్చోవాలని ఆదేశించారాయన.

సీనియర్ IPS అధికారి అయిన నాగేశ్వర్‌రావుకు అసాధారణ శిక్ష పడింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగొయ్ ఆయనకు లక్ష రూపాయల ఫైన్ వేసి.. CJI కోర్టు రూమ్‌లో కూర్చోవాలని ఆదేశించారు. నాగేశ్వర్‌రావుతో పాటు సీబీఐ న్యాయ సలహాదారుకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని గొగొయ్‌ స్పష్టంచేశారు.

Recommended For You