పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర జల వనరులశాఖ ఇచ్చిన లెక్కలు సహేతుకమైనవే..

State Water Resources Department estimates on Polavaram project are reasonable.

ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపింది. 2017-18 ధరల ప్రకారం అంచనాలకు సీడబ్ల్యూసీ సలహా కమిటీ ఆమోదం లభించింది. 55 వేల 548.87 కోట్ల రూపాయలకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన దస్త్రాన్ని జలవనరుల శాఖకు సీడబ్ల్యూసీ కమిటీ పంపనుంది.

Also read : నేడు రాష్ట్రపతిని కలవనున్న సీఎం చంద్రబాబునాయుడు బృందం

దాదాపు ఏడాదిగా కొర్రీల మీద కొర్రీలు వేస్తున్న సాంకేతిక సలహా మండలి… చివరికి రాష్ట్రం ఇచ్చిన మొత్తానికే ఆమోద ముద్ర వేసింది. 2017-18 అంచనా వ్యయాన్ని కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ పరిధిలోని టీఏసీ గుర్తించాయి. దీంతో పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర జల వనరులశాఖ ఇచ్చిన లెక్కలు సహేతుకమైనవేనని స్పష్టమైంది. ఇప్పటి దాకా పోలవరం ప్రాజెక్టు అంచనాల విషయంలో కేంద్రం అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చింది. ప్రధాని మోదీ కూడా నిర్మాణ వ్యయంపై సందేహాలు వ్యక్తం చేశారు.

రాష్ట్ర అధికారులు ఇచ్చిన వివరణతో టీఏసీ సంతృప్తి చెందడంతో కేవలం గంటలోనే ఈ సమావేశం ముగిసింది. దీంతో, ప్రాజెక్టు నిర్మాణాన్ని లక్ష్యంలోగా పూర్తి చేసేందుకు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌కు మిగిలి ఉన్న కొద్ది రోజులలోనే గట్టిగా పట్టుబట్టి కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని రాష్ట్ర జల వనరులశాఖ భావిస్తోంది. త్వరగా ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్‌ క్లియరెన్స్‌ను తీసుకుని.. కేంద్ర ఆర్థికశాఖ సమ్మతి పొంది… కేంద్ర కేబినెట్‌లో ఆమోదముద్ర వేయించుకునేందుకు రాష్ట్ర అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు.

Recommended For You