టాలీవుడ్ లో విషాదం.. అగ్ర దర్శకుడు కన్నుమూత

tollywood directer vijaya bapineeyudu died

ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. డబ్బు డబ్బు డబ్బు, పట్నం వచ్చిన పతివ్రతలు, మగమహారాజు, మహానగరంలో మాయగాడు, హీరో, మగధీరుడు, నాకు పెళ్ళాం కావాలి,
ఖైదీ నెంబరు 786, జూలకటక, మహాజనానికి మరదలు పిల్ల, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, కొడుకులు, ఫ్యామిలీ వంటి హిట్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. పలు విజయవంతమైన చిత్రాలను సైతం నిర్మించారు. చిరంజీవికి అధ్బుతమైన విజయాలు అందించారు. కృష్ణతో మాస్ సినిమాలు నిర్మించి ఆయన ఫాలోయింగ్ పెరడానికి దోహదపడ్డారు. 1980- 90లలో ఆయన సినిమాలకు విపరీతంగా క్రేజ్ ఉండేది.

హీరోలకు సమానంగా ఆయన సినిమాలంటే కలెక్షన్లు వచ్చేవి. గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి సినీజీవితంలో మైలురాయిగా నిలిచింది. చిత్రపరిశ్రమలో విజయానికి ఆయన చిరునామాగా ఉండేవారు. 1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గరలో చాటపర్రు గ్రామంలో జన్మించారు. ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో డిగ్రీ చేసిన ఆయన సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. అయితే అంతకంటే ముందు విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు ఎడిటర్ గా వ్యవహరించారు. ఇండియన్ ఫిల్మ్స్ పత్రికను కూడా నడిపించారు.

Recommended For You