మోదీ ఎదుటే మహిళా మంత్రి నడుముపై పబ్లిక్‌గా..

త్రిపురలో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న వేదికపై మంత్రి మనోజ్ కాంతి దేవ్ మహిళా మంత్రిపై అసభ్యంగా ప్రవర్తించారు. త్రిపుర మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రిగా ఉన్న సాంతనా చక్మా నడుము మీద చేయి వేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి మనోజ్ ప్రవర్తనకు ఇబ్బంది పడ్డ సదరు మహిళా మంత్రి.. ఆయన చేయిని వెనక్కి నెట్టారు.

Also Read : ప్రేమజంటపై ఇనుపరాడ్ తో దాడి.. యువతి మృతి..

ఓవైపు ప్రధాని, మరోవైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వేదికపై ఉన్న సమయంలో మంత్రి మనోజ్ కాంతి దేవ్ అసభ్యకర రీతిలో మహిళా మంత్రిని తాకడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

ఇదిఇలా ఉంటే అధికార బీజేపీ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. మహిళా మంత్రి ఎలాంటి ఫిర్యాదు చేయలేదంటోంది. మొత్తానికి మనోజ్ కాంతి దేవ్ చేసిన పనిపై సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.