ఇండిగో, విస్తారా ఆఫర్.. రూ.899కే వస్తారా అంటూ..

ఒకప్పుడు లగ్జరీ అనుకునే విమాన ప్రయాణం ఇప్పుడు దాదాపుగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. కొన్ని విమానయాన సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణీకులను ఆకర్షిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ఇండిగో, విస్తారా ఎయిర్‌లైన్స్ డిస్కౌంట్‌ ధరలకు టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. పలు ప్రధాన రూట్లలో ఈ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్లు విస్తారా ఎయిర్‌లైన్స్, ఇండిగో ప్రకటించాయి.
ఇండిగో ఆఫర్
ఈనెల 12,13 తేదీల్లో టికెట్లను బుకింగ్ చేసుకున్న వారికి డిస్కౌంట్ ధర అందుబాటులో ఉంటుంది. ఈ రోజుల్లో టికెట్లను బుక్ చేసుకున్న వారికి ఫిబ్రవరి 26 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ఈ ఆఫర్లు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది.


విస్తారా ఆఫర్
విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించాలంటే ఈనెల 12,13 తేదీల్లో టికెట్లను బుకింగ్ చేసుకున్నట్లైతే డిస్కౌంట్ పొందవచ్చని అంటోంది. ఇలా బుక్ చేసుకున్నవారు ఫిబ్రవరి 27 నుంచి సెప్టెంబర్ 18 వరకు మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చు.
ఇండిగో, విస్తారా ఎయిర్‌లైన్స్ రెండూ దేశీ విమాన టికెట్లను రూ.899కే అందిస్తున్నాయి. ఇక అంతర్జాతీయ రూట్లలో టికెట్ ప్రారంభ ధర రూ.3,399గా ఉంది. విమానం ప్రయాణించే రూట్లు.. ఢిల్లీ-అహ్మదాబాద్, ఢిల్లీ-కోల్‌కతా, ఢిల్లీ- చెన్నై, ముంబై-గోవా వంటి పలు రూట్లలో ఈ రెండు సంస్థలు ఆఫర్లను ఇస్తున్నాయి.

Recommended For You