మంచంకోడుకు చున్నీ బిగుసుకుని చిన్నారి మృతి!

తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం నరసింహాపురంలో దారుణం జరిగింది. మంచంకోడుకు చున్నీ బిగుసుకుపోవడంతో ఊపిరాడక.. ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రులు పాపను ఇంటి వద్ద వదలి ఊరికి వెళ్లడంతో.. ఒంటరిగా ఉన్నట్టు తెలుస్తోంది. తాను కూడా ఊరికి వస్తానని అమ్మాయి మారాం చేసినా తల్లిదండ్రులు నచ్చచెప్పి.. వదిలేసి వెళ్లారు. తీరా తిరిగి వచ్చేసరికి చిన్నారి శవమై కన్పించడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Also Read : భార్యను లాడ్జీ రూంకు పిలిపించి.. దారుణంగా..

పాప ఆడుకునే సమయంలో ప్రమాదవశాత్తు గొంతుకు ఉరి బిగిసిందా.. లేక నిజంగానే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాప చున్నీతో ఉరివేసుకున్నట్టుగా ప్రచారం జరగడంతో.. 8 ఏళ్ల చిన్నారికి అసలది సాధ్యపడుతుందా అనే కోణంలోనూ విచారిస్తున్నారు.